calender_icon.png 26 August, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్య, వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

26-08-2025 06:52:03 PM

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

తుంగతుర్తి,(విజయక్రాంతి): విద్యానికే వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కల్పిస్తూ..పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు  అందించాలని ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ నిధులతో ఏర్పాటుచేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ తో కలిసి ఆయన ప్రారంభించారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. సాధ్యమైనంత త్వరలో ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న నిర్మాణంలో నూతన ఆస్పత్రి బిల్లులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదరం రాజనర్సింహ తో మాట్లాడి బిల్లులు మంజూరు  చేపిస్తానని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే ఇంటిగ్రేడ్ పాఠశాలకు 200 కోట్ల నిధులతో తిరుమలగిరిలో ఏర్పాటు జరుగుతున్నట్లు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యముతో పాఠశాలలు, దవాఖానాలో కనీసం మరుగుదొడ్లు కూడా నిర్మాణం చేపట్టలేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటిగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, సన్నబియ్యం, రైతు భరోసా, రుణమాఫీ, గృహ లక్ష్మీ, మహాలక్ష్మీ పథకాలను అమలు చేస్తూ ప్రజల హృదయాల్లో నిలిచిపోతున్నారని తెలిపారు తుంగతుర్తి ప్రభుత్వ దవాఖానకు నూతన జనరేటర్ మంజూర అయిందని అధికారులు తెలిపారు.