05-02-2026 01:53:58 AM
రియల్ ఎస్టేట్‌లో రెండు దశాబ్దాల ఘనత
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మకుటా డెవలపర్స్ తమ కార్యాలయంలో ఒక అంతర్గత వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సంస్థ నాయకత్వ బృందం, ఉద్యోగులు పాల్గొన్నారు. మకుటా డెవలపర్స్ చైర్మన్ జనార్ధన్ కొంపల్లి మాట్లాడుతూ.. సంస్థ స్థాపన నేపథ్యం, ఆరంభ దశల్లో ఎదుర్కొన్న సవాళ్లు, అలాగే నేటికీ మకుటాను ముందుకు నడిపిస్తున్న మౌలిక విలువలను పంచుకున్నారు.
గత రెండు దశాబ్దాల్లో సంస్థ సాధించిన ప్రగతిని కూడా నాయకత్వ బృందం ప్రస్తావించింది. ఇప్పటివరకు 2,500 మందికి పైగా కస్టమర్లకు కోటి చదరపు అడుగులకుపైగా నిర్మాణ విస్తీర్ణాన్ని మకుటా డెవలపర్స్ అందించింది. తీవ్ర వృద్ధిని లక్ష్యంగా కాకుండా, కస్టమర్ల నమ్మకాన్ని సంపాదిస్తూ, వ్యవస్థబద్ధంగా ఎదగడ మే మకుటా విధానం అని సంస్థ పేర్కొంది.