calender_icon.png 18 October, 2025 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి బీసీ బంద్‌కి మాలమహానాడు సంపూర్ణ మద్దతు

17-10-2025 10:15:58 PM

జాతీయ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు గంపల శివకుమార్

ఏటూరునాగారం,(విజయక్రాంతి): తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధన కోసం జరగనున్న బీసీ బంద్‌కు మాలమహానాడు సంస్థ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జాతీయ మాలమహానాడు రాష్ట్రా ఉపఅధ్యక్షుడు గంపల శివకుమార్ మాట్లాడుతూ బీసీలు ఐదు శాతం జనాభా ఉన్న ఓసీలు, పదిహేడు శాతం ఉన్న ఎస్సీలు, తొమ్మిది శాతం ఉన్న ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నా, 52శాతం జనాభా ఉన్న బీసీలకు కేవలం 42శాతం కోటా మాత్రమే ఉండటం అన్యాయమని చెప్పారు. ఈ పరిస్థితిని మార్చేందుకు రేపు జరిగే బంద్‌లో మాలమహానాడు కార్యకర్తలు,జిల్లా నాయకులు విస్తృతంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.