17-10-2025 10:13:03 PM
దౌల్తాబాద్: మరణించిన తమ స్నేహితుడు జిర్కపల్లి నరేందర్ జ్ఞాపకార్థంగా దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన పదవ తరగతి స్నేహితులు స్థానిక బస్ స్టేషన్‌లో ప్రయాణికులు సౌకర్యంగా కూర్చోవడానికి సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయించారు. స్నేహితుడి జ్ఞాపకార్థం సమాజానికి ఉపయోగపడే విధంగా ఏదైనా చేయాలని భావించిన వారు ఆలోచనను కార్యరూపం దాల్చారు. ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ మన స్నేహితుడు మన మధ్య లేకపోయినా, ఆయన జ్ఞాపకం చిరస్థాయిగా నిలిచేలా సమాజానికి ఉపయోగపడే పని చేయడం మాకు గర్వంగా ఉంది అని పేర్కొన్నారు.