calender_icon.png 12 August, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓజీ.. అగ్ని తుఫాను!

03-08-2025 12:00:00 AM

పవన్‌కల్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న సినిమా ‘ఓజీ’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాశ్‌రాజ్, శ్రియారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి మొదటి గీతం ‘ఫైర్ స్టార్మ్’ శనివారం విడుదలైంది.

ఈ గీతం నిజంగానే ఓ అగ్ని తుఫానులా ఉంది. తమన్ స్వరపరిచిన ఈ గీతానికి ప్రముఖ నటుడు శింబు గాత్రాన్ని అందించారు. ఉద్వేగం, ఉత్సాహంతో నిండిన ఆయన స్వరం.. ఈ పాటను మరోస్థాయికి తీసుకొనివెళ్లింది. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రవి కే చంద్రన్; కూర్పు: నవీన్ నూలి.