తెలుగు నామ సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలి
బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జై సింహ
ముషీరాబాద్, మార్చి 19(విజయక్రాంతి): పరాభవ నామ తెలుగు నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని బీఆర్‌ఎస్ యువ నాయకులు ముఠా జై సింహ ఆకాంక్షించారు. గురువారం ఉగాది పండుగను పురస్కరించుకొని ముషీరాబాద్ ఎంసిఎచ్ కాలనీలో గల అభయ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు టి. సోమన్ ఆధ్వర్యంలో భక్తులకు ఉగాది పచ్చడి, బొబ్బట్లు పంపిణీ చేశారు.
ముఖ్య అతిథిగా హాజరైన ముఠా జై సింహ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యా లతో ఉండాలన్నారు. ప్రజలు కోరుకున్న ఆకాంక్షలు నెరవేరాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముఠా జైసింహను టి. సోమన్ పూలమాలలు వేసి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయ కులు డి.శివ ముదిరాజ్, దీన్ దయాల్ రెడ్డి, టెంట్ హౌస్ శ్రీనివాస్, డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సదా, నాయకులు ముత్యం బాలరాజు గౌడ్, వల్లాల శ్రీనివాస్ యాదవ్, అడిక్ మెట్ డివిజన్ అధ్యక్షుడు బల్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




