7 August, 2026 | 8:44 AM

వరంగల్‌లో పారిశుద్ధ్య కార్మికుడికి దొరికిన రైఫిల్

23-08-2024 12:13 PM

వరంగల్: వరంగల్ ఎంజీఎం జంక్షన్ లో సీఆర్పీఎఫ్ వాహనం నుంచి కార్బన్ రైఫిల్ కింద పడింది. యూనివర్సిటీ పరిధిలో ఉన్న బెటాలియన్ తరలించే క్రమంలో గన్ రోడ్డుపైన పడిపోయింది. వరంగల్ మహానగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికుడు గన్ ను గుర్తించాడు. తుపాకీని వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ కు అందించాడు. దీంతో వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ తుపాకీ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. సమచారం అందుకున్న మట్వాడ పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకుని ⁠తిరిగి సీఆర్పీఎఫ్ జవాన్ కు తుపాకి అప్పగించారు.