21-11-2025 12:24:34 PM
హైదరాబాద్: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట్(Achampet) మండలం పల్కపల్లి గ్రామంలో గంజాయికి బానిసైన ఓ యువకుడిని ఇంట్లోనే గంజాయి(Ganja)సాగు చేస్తూ అరెస్ట్ అయ్యాడు. నిందితుడిని నాగనులు మధుగా పోలీసులు గుర్తించారు. అతను వ్యక్తిగత వినియోగం కోసం గంజాయి మొక్కను పెంచుతున్నట్లు విచారణలో అంగీకరించాడు. సాధారణ తనిఖీల్లో, పోలీసులు అతని నివాసంలో గంజాయి మొక్కను గుర్తించి, వెంటనే మధును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.