03-05-2025 06:50:57 PM
పాపన్నపేట: ఉరి వేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని నార్సింగి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం వివరాలు... గ్రామానికి చెందిన బోడ యాదయ్య(48) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొంత కాలంగా మద్యానికి బానిసగా మారి, మద్యం మత్తులో ఇంట్లో వారితో గొడవ పడేవాడు. జీవితంపై విరక్తి చెందిన యాదయ్య శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్లిన స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.