09-02-2025 11:25:49 PM
ముషీరాబాద్ (విజయక్రాంతి): భవనంపై నుండి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగింది. చిక్కడపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎం శ్రీనివాస్ (50) తన షాపు గల పాపయ్య ఎస్టేట్ బిల్డింగ్‌పై నుండి ఆదివారం సాయంత్రం దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతో చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించారు. మృతుడి ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను ఏసీపీ ఆధ్వర్యంలో సేకరిస్తున్నారు. వివరాలు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.