calender_icon.png 27 January, 2026 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి

27-01-2026 06:11:21 PM

వనపర్తి జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా చర్యలు - జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

 మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని

వనపర్తి,(విజయక్రాంతి): మున్సిపల్ సాధారణ ఎన్నికలు పకడ్బందీగా, పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించే విధంగా కృషి చేయాలని రాష్ట్ర ఎనికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ జారి చేసే ముందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, రాష్ట్ర డిజిపి బి.శివధర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. జనవరి, 28 నుండి 30వ తేదీ వరకు ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.

31న స్క్రూటినీ, వ్యాలిడిటీ ఉన్న నామినేషన్ల విడుదల. ఫిబ్రవరి, 1న ఆర్డీఓ కు అప్పీల్ చేసుకునే అవకాశం, ఫిబ్రవరి 2న అప్పిల్ పరిష్కారం.  ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 3.00 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు సాయంత్రానికి  నామినేషన్ల తుదిజాబితా విడుదల. ఫిబ్రవరి 11వ తేదీన ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నిక నిర్వహణ, ఫిబ్రవరి 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని షెడ్యూల్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. 80 వార్డులకు గాను 6 ఎస్.ఎస్.టి., ఎఫ్.ఎస్.టి బృందాలను ఇప్పటికే సిద్దం చేసినట్లు తెలిపారు. పోలీస్ శాఖ సహకారంతో అత్యంత పకడ్బందీగా ఎన్నికల నియమ నిబంధన మేరకు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్  సమావేశం ఎన్నికల ప్రవర్తన నియమావళిపై దిశా నిర్దేశం

జనవరి, 27న ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినందున తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో వచ్చిందని తెలిపారు. 24 గంటల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాంగణాల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీ లు, క్యాలండర్ లు, గోడ పైన రాతలు తొలగించాలని, విగ్రహాలకు తొడుగులు వేయాలని, 48 గంటల్లో పబ్లిక్ స్థలాల్లో 72 గంటల్లో ప్రైవేట్ స్థలాల్లో ఫ్లెక్సీలు తొలగించాలని ఆదేశించారు. జనవరి, 28న ఉదయం 10 గంటలకు అన్ని రిటర్నింగ్ కార్యాలయాల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఫారం-1 విడుదల చేసి 10.30 నుండి నామినేష్ల స్వీకరణ ప్రారంభించాలని ఆదేశించారు. 

నామినేషన్ సెంటర్లలో నిబంధుల ప్రకారం  అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఏ ఒక్క కొత్త అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వీలు లేదని, ఎన్నికల ప్రవర్తన నియమావళినీ కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు.  ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య వనపర్తి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు డిపిఓ రఘునాథ్ రెడ్డి మిగతా మున్సిపాలిటీల కమిషనర్లు సిపిఓ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.