27-01-2026 06:17:43 PM
జవహర్ నగర్,(విజయక్రాంతి): జవహర్ నగర్ డివిజన్ ఏసిపి గా ఎస్ చక్రపాణి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మల్కాజిగిరిలో ఏసీపీగా పని చేస్తున్న చక్రపాణి జవహర్ నగర్ కు బదిలీపై వచ్చారు. ఏసీపీగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు చార్జి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపి చక్రపాణి మాట్లాడుతూ తన పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో శాంతి భద్రతలను కాపాడుతూ ఎల్లవేళలా డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటానని శాంతి భద్రతల పరిరక్షనే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. పోలీసుల ప్రతిష్టను పెంచే సరికొత్త నూతన విధానాలతో ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.