10-02-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న 84వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్, నుమాయిష్-2025 గడువు పొడగింపునకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అనుమతి నిరాకరించారు. ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరిగేను ఈ ఏడాది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించగా ఆయన సంతాప దినాల్లో భాగంగా రెండు రోజులు ఆలస్యం జనవరి 3న ప్రారంభమైంది.
దీంతో ఫిబ్రవరి 17 వరకు నుమాయిష్‌ను పొడగించేందుకు అనుమతివ్వాలని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు కోరగా సీపీ సీవీ ఆనంద్ అందుకు నిరాకరించినట్లుగా తెలుస్తోంది.