అప్పుల భాదతో వ్యక్తి ఆత్మహత్య
23-06-2026 12:00 AM
జగదేవపూర్, జూన్ 22: జగదేవపూర్ మండల పరిధిలోని దౌలపూర్ గ్రామానికి చెందిన దేశెట్టి రాజు (36) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ ఐ కృష్ణ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ ఐ మాట్లాడుతూ ఇటీవల గృహ నిర్మాణం కోసం తిసుకున్న రుణం (ఈఎంఐ) చెల్లింపుల విషయం భార్య భర్తల మధ్య గొడవలు తలేత్తయి.
ఈ నేపథ్యంలో భార్య తన పుట్టింటికి వెళ్లిపోవడంతో రాజు తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో పడకగదిలో ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకొని మరణించినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఒక కుమార్తె,ఒక కుమారుడు ఉన్నారు. మృ తుడు తల్లి దేశెట్టి నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జగదేవపూర్ ఎస్త్స్ర కృష్ణారెడ్డి తెలిపారు.






