06-10-2025 12:05:23 AM
రాజన్న సిరిసిల్ల: అక్టోబర్ 5 (విజయక్రాంతి) సిరిసిల్ల పట్టణం బి. వై. నగర్ లో అ ప్పుల బాధ, సరైన పని లేకపోవడంతో కు టుంబ పోషణ భారం కావడంతో మనస్తా పం చెందిన ఓ వ్యక్తి తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘ టన చోటు చేసుకుంది. మృతుడిని స్వర్గం రమేష్గా గుర్తించారు. బి.వై. నగర్లో అద్దె ఇం ట్లో నివాసముంటున్న రమేష్ గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమ వుతున్నాడు.
ఈ కుటుంబానికి సుమారు రూ. 20 లక్షల అప్పు ఉన్నట్లు సమాచారం. అప్పులు తీర్చే మార్గం లేక, కుటుంబాన్ని పో షించడం కష్టంగా మారడంతోనే రమేష్ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భార్య సంధ్య, కూతురు నిహారిక 13, కొడుకు మదన్ 11 తో కలిసి ఉంటున్న రమేష్, ఆర్థిక సమస్యల కారణంగా తమ ఉన్న ఇంటిని కూ డా అమ్ముకోవాల్సి వచ్చి అద్దె ఇంట్లో ఉం టున్నారు.
ఈరోజు తెల్లవారుజామున రమే ష్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం తో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.