ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు మేలు
నర్సాపూర్ ఆగస్టు 20: వరి సాగుతో అధిక నీటి వినియోగం, సాగు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారిం చాలని శాస్త్రవేత్త డా. సతీష్ సూచించారు. లింగాపూర్ రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘పంటల వైవిధ్యీకరణ పై రైతులకు శిక్షణ ఇచ్చారు‘. కందులు, పెసలు, మినుములు, శనగ, మొక్కజొన్న, నువ్వులు, వేరుశనగ వంటి పంటలను నీటి లభ్యత, నేల స్వభావం, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా సాగు చేయాలని సూచించారు.
పంటల మార్పిడితో నేల సారం, నీటి వనరులను కాపాడటంతో పాటు సాగు ఖర్చులు తగ్గించి రైతుల ఆదాయం పెంచుకోవచ్చని అన్నారు.అనంతరం ఏవో దీపిక మాట్లాడుతూ రైతులు తమ భూమి నీటి వనరులు మార్కెట్ పరిస్థితిలకు పరిగణలోకి తీసుకొని ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలన్నారు.కార్యక్రమoలో వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.






