21 August, 2026 | 3:04 AM

ఖేడ్‌లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి

21-08-2026 01:59 AM

పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి 

నారాయణఖేడ్, ఆగస్టు 20: భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను గురువారం స్థానిక మా ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవరెడ్డి, ఏఐసీసీ పరిశీలకులు దీపక్ రాథోడ్, పిసిసి పరిశీలకులు రియాజ్, దుద్దిళ్ళ శ్రీనుబాబూ, స్థానిక మున్సిపల్ చైర్మన్ నగేష్ షట్కార్, జిల్లా డిసిసి ప్రధాన కార్యదర్శి పి. చంద్రశేఖర్ రెడ్డి లు హాజరై పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సృజన్ సంఘటన అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను నిర్వహించడం జరుగుతుందన్నారు. భారతదేశంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకువచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.