21 August, 2026 | 3:03 AM

అధునాతన సాంకేతికతపై గీతం అధ్యాపకులకు శిక్షణ

21-08-2026 02:00 AM

మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్‌పై కార్యశాల

పటాన్‌చెరు, ఆగస్టు 20 : వేగంగా మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని, బోధన-శిక్షణా నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు గాను హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ అధ్యాపకులకు మ్యాట్ ల్యాబ్ ను ఉపయోగించి మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ పై మూడు రోజుల ప్రత్యేక కార్యశాలను ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించారు.

ఈ వర్క్ షాపును ఆర్కాన్స్ ఇన్, మ్యాథ్ వరక్స్ ల సంయుక్త సహకారంతో గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ (జీఎస్సీఈ)లోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈఈసీఈ) విభాగం నిర్వహించింది. ఈ కార్యశాలను, మ్యాట్ ల్యాబ్ ఆధారిత మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), డీప్ లెర్నింగ్ (డీఎల్)లో అధ్యాపకులకు ఆచరణాత్మక అనుభవాన్ని అందించడానికి రూపొందించారు.

ముఖ్యంగా, గణన భావనలను సమకాలీన ఇంజనీరింగ్, పరిశోధన సమస్యలకు పరిష్కారాలుగా మార్చడంపై దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక భావనలను ఆచరణాత్మక అమలుతో కలిపి, డేటా-ఆధారిత పద్ధతులను విభిన్న సాంకేతిక రంగాలలో ఎలా అన్వయించవచ్చో అన్వేషించడానికి గీతం అధ్యాపకులకు వీలు కల్పించారు.