calender_icon.png 14 May, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలీసెట్‌కు 92.64 శాతం హాజరు

13-05-2025 11:53:16 PM

హైదరాబాద్ (విజయక్రాంతి): ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలీసెట్ (Polytechnic Common Entrance Test) మంగళవారం ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 92.64 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. 276 పరీక్ష కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. బాలురు 57,178 మంది, బాలికలు 49,538 మంది దరఖాస్తు చేసుకోగా, బాలురు 53,086 మంది, బాలికలు 45,772 మంది హాజరయ్యారు. బాలురు 92.84 శాతం, బాలికలు 92.4 శాతంతో మొత్తంగా 92.64 శాతం మంది పరీక్ష రాశారు. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కార్యదర్శి ఏ పుల్లయ్య తెలిపారు.