calender_icon.png 14 May, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడవుల్లో అగ్ని ప్రమాదాలను నివారించాలి

13-05-2025 11:44:01 PM

వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు.. 

అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. 

సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష.. 

హైదరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అధికారులకు సూచించారు. అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ, వన్యప్రాణుల సంరక్షణకు తీసుకునే చర్యలపై మంగళవారం సచివాలయంలో సంబంధిత శాఖ అధికారులతో మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏ జిల్లాలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, వాటి వల్ల వణ్య ప్రాణులకు ఇబ్బంది రాకుండా తీసుకుంటున్న చర్యలేంటి, వేసవికాలం దృష్ట్యా అడవుల్లో, జూలలో వన్యప్రాణాలు, ఇతర జంతువులకు తగిన నీటి సదుపాయాల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. నెహ్రూ జూపార్కు, వరంగల్ జూపార్కులలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి సూచించారు. వన్యప్రాణులకు నీరు, ఆహారం విషయంలో అశ్రద్ధ వహించవద్దని ఆదేశించారు. సమావేశంలో పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ, పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) ఈలుసింగ్ మేరు, పీసీసీఎఫ్(స్కీమ్స్) జవహర్, వైల్డ్‌లైఫ్ ఓఎస్డీ శంకరన్, నెహ్రూ జూపార్క్ డైరెక్టర్ సునీల్ హీరామత్ పాల్గొన్నారు.