calender_icon.png 13 May, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరి వేసుకొని వ్యక్తి మృతి

13-05-2025 06:15:32 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని గోదావరి రోడ్డుకు చెందిన తొగరి రాజేష్(40) అనే వ్యక్తి మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో లుంగీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడని ఎస్ఐ సురేష్(SI Suresh) తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం... మృతునికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా భార్యకు తనకు కుటుంబ కలహాలు రావడంతో భార్య సుమలత తన ఇద్దరు పిల్లలను తీసుకొని తన తల్లి ఊరైన చొప్పరిపల్లికి నెల రోజుల క్రితం వెళ్లిపోయింది. భార్య, పిల్లలు వెళ్ళిన నుండి మృతుడు తీవ్ర మనస్తాపానికి గురై మద్యానికి బానిసై అదే క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడన్నారు. మృతుని అక్క మామిడి రాయబోసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.