12-11-2025 12:00:00 AM
రామచంద్రాపురం, నవంబర్ 11: ఆన్‌లైన్ బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు ఓయో రూంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడ కమాన్ సమీపంలో ఉన్న లావీ షోక్ ఓయో రూంలో జరిగింది. సాయినగర్‌కు చెందిన అఖిల్ (30) ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగులలో భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు. అప్పులు ఎక్కువ కావడంతో తీవ్ర మానసిక ఆవేదనకు గురై, ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది.
అయితే సోమవారం ఓయో రూం బుకింగ్ చేసుకుని అక్కడికి చేరుకున్నాడు. ఆ తర్వాత తన తండ్రి సంగీత్‌రావుకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే రూమ్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అఖిల్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు విడిచినట్లు పోలీసులు తెలిపారు. రామచంద్రాపురం పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.