04-09-2025 05:49:43 PM
నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్ మండలం(Nakrekal Mandal)లోని కడపర్తి గ్రామ శివారులో గేదెను రక్షించబోయి వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గేదే కాళ్లకు బంధం కట్టి ఉండడంతో, గేదె చెరువులోకి పరిగెత్తడంతో రక్షించడానికి వెళ్లిన క్రమంలో బెల్లి లింగయ్య(43) ప్రమాదావశాత్తు నీటిలో మునిగి మరణించాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.