04-09-2025 05:47:51 PM
మంచిర్యాల, (విజయక్రాంతి) : సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి(Sarvepalli Radhakrishnan Birth anniversary) సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో, ఎస్ఆర్ఆర్ జూనియర్ కళాశాలలు, మిమ్స్ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో గురువారం టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా మారి తోటి విద్యార్థులకు విద్యాబోధన చేశారు. అనంతరం ఉపాధ్యాయ పాత్ర పోషించిన వారిలో ఉత్తమంగా బోధించిన ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమాల్లో కళాశాల యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.