calender_icon.png 7 September, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినాయకుడి వద్ద అన్నదానం ప్రారంభించిన కలెక్టర్

04-09-2025 05:52:29 PM

ఉద్యోగులు, సిబ్బందికి వడ్డించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద గురువారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని భోజన విరామ సమయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(District Collector Sandeep Kumar Jha) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, సందర్శకులకు కలెక్టర్ స్వయంగా వడ్డించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీఆర్డీఓ శేషాద్రి, డీడబ్ల్యూఓ లక్ష్మీరాజం, డీఏఓ అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన అధికారి లత, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాం రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.