calender_icon.png 22 May, 2025 | 3:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

12-04-2025 12:32:53 AM

గద్వాల, ఏప్రిల్ 11 ( విజయక్రాంతి ) : అనుమానాస్పద స్థితిలో  కురువ రామకృష్ణ (30) శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకొని మృ తి చెందిన సంఘటన గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. 

స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకా రంగా రామకృష్ణ అనే యువకుడు  తనతో కలిసి తిరగడం లేదనే ఫోన్ మాట్లాడడం లేదని గద్వాలకు చెందిన ట్రాన్స్ జెండర్ శివ (శివాణి) తో పాటు మరో ముగ్గురు ట్రాన్స్  జెండర్స్ కలిసి  రామకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో ప్రవేశించి ఇంటిలోపల తలుపులు వేసి ఆ యువకుడిని నోట్లో బట్టపెట్టి గొంతు నులిమి, విచక్షణ రహితంగా దాడి చేయగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో గమనించిన ట్రాన్స్ జెండర్స్ నలుగురు కలిసి ఓ వాహనంలో జిల్లా ఆసుపత్రికి  తీసుకెళ్ళి వైద్యులకు చూయించగా రామకృష్ణ మృతి చెందాడని వైద్యులు చెప్పడంతో  అక్కడినుండి ట్రాన్స్ జెండర్స్ పారిపోవడం జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు.

రామకృష్ణ సోదరి వివాహానికి కుటుంబ సభ్యులు అందరూ వెళ్లడంతో వారితో పాటు రామకృష్ణ కూడా వివాహానికి బయల్దేరే సమయంలో ఈ ఘటన జ రిగిందన్నారు.   కాగా మృతునికి భార్య ము గ్గురు కూతుర్లు ఉన్నారు. రామకృష్ణ ను గొంతునులిమి  దాడి చేసి హతమార్చిన ట్రా న్స్ జెండర్స్  అంటు జిల్లా ఆసుపత్రి ముం దు  పోలీసులు తగు న్యాయం చేయాలని బంధువుల ఆందోళనను చెప్పట్టారు. భాధితుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు న మోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభీంచారు.