3 July, 2026 | 12:55 AM

అప్పుల బాధతో వ్యక్తి అదృశ్యం

03-07-2026 12:00 AM

పీఎస్‌లో ఫిర్యాదు చేసిన భార్య                                   

జవహర్‌నగర్, జూలై 2 (విజయక్రాంతి): అప్పుల బాధతో ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన వివరాల ప్రకారం మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ మార్వాడి లైన్లో రావికంటి ఈశ్వర్ (44) భార్య పిల్లలతో (బాలాజీ నగర్) కలిసి నివసిస్తున్నారు.

ఈశ్వర్ ఈనెల 30వ తేదీన ఇంట్లో ఎవరికి చెప్పకుండా సాయంత్రం తన స్కూటీపై బయటికి వెళ్లి సాయంత్రం తిరిగి రాలేదు. ఈ మేరకు భార్య ఈశ్వర్ గురించి చుట్టుపక్కల వెతికిన తెలిసిన వారి వద్ద వెతికిన సమాచారం లభించలేదు. అప్పుల బాధతోనే ఈశ్వర్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడని, ఫోన్ ఇంట్లోనే పెట్టి పోయాడని, భార్య రజిత జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.