నమ్మకం ఉన్న చోటుకే నాయకుల ప్రయాణం
ఆర్బాటాలను కాదు మంచిని చూసి పార్టీలోకి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్, జూలై 2 (విజయక్రాంతి) : ప్రజలకు మంచి జరుగుతుంది అని నమ్మే కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు వస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు బి ఆర్ ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సమక్షంలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి,నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బెక్కెరి మధుసూదన్ రెడ్డి, రాములు యాదవ్, మైత్రి యాదయ్య, మున్నూరు రవి, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు అజ్మత్ అలి, కార్పొరేటర్లు పెద్ద గొల్ల నర్సింహులు, తాహేర్, నాయకులు అబ్దుల్‌హక్, గోపినాయక్, జాజి మొగ్గు నర్సింహులు పాల్గొన్నారు.






