17 April, 2026 | 3:50 PM

Breaking News

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి   •   ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు   •   గాయని మంగ్లీపై అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్న   •   కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. మహిళా మృతి   •   దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర... కొత్తగా మహిళా బిల్లు అవసరం లేదు   •   బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి   •   జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి   •   ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •  

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

25-06-2025 10:57 PM

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన..

ఇబ్రహీంపట్నం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్(Ibrahimpatnam Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండల పరిధి ఉప్పరిగూడ గ్రామానికి చెందిన బుట్టి ప్రేమ్ రాజ్(65), ఇదే గ్రామంలోని వాటర్ ప్లాంట్ లో పనిచేస్తున్నాడు. గత కొన్ని నెలలుగా బొంగ్లూరులో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా బుధవారం సాయంత్రం 4.30 సమయంలో వాటర్ ప్లాంట్ పనుల నిమిత్తం తన బజాజ్ చెతక్ పై ఉప్పరిగూడకు వచ్చి తిరిగి బొంగ్లూరు వెళ్తుండగా మార్గమధ్యంలో మంగళ్ పల్లి చౌరస్తాకి రాగా అదే సమయంలో ఇబ్రహీంపట్నం నుండి బొంగ్లూరు వెళ్తున్న ఓ లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ప్రేమ్ రాజ్ లారీ వెనుక టైరు కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే నగరంలోని కామినేని ఆసుపత్రికి  తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించాడు. బాడీనీ మార్చురీకి తరలించడం జరిగింది. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నాము. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.