calender_icon.png 7 September, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జైన సన్యాసిలా నటించి కోటి విలువైన కలశాలు చోరీ

07-09-2025 01:04:04 AM

-ఎర్రకోటలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఘటన

-వజ్రాలు పొదిగిన కలశాలతో ఉడాయించిన వ్యక్తి

-సీసీ కెమెరా పుటేజీల్లో రికార్డ్

-గాలిస్తున్న పోలీసులు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ఢిల్లీలోని ప్రఖ్యాత ఎర్రకోటలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భారీ దొంగతనం జరిగింది. సెప్టెం బర్ 3న ఎర్రకోటలోని గేట్ నం.15 వద్ద జైనుల ఆధ్యాత్మిక కార్యక్రమం ‘దసలక్షణ్ మ హాపర్వ్’లో..  వజ్రాలు, పచ్చలు, బంగారం తో తయారు చేసిన రూ. కోటి విలువైన రెం డు కలశాలు చోరీకి గురైనట్టు శనివారం ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం 10 రోజుల పాటు జరగనుంది. జైన సన్యాసిగా కార్యక్రమానికి వచ్చిన వ్యక్తి ఏకంగా విలువైన రెండు కలశాలతో ఉడాయించినట్టు సీసీ టీవీల్లో రికార్డయింది.

760 గ్రాములు, 115 గ్రాముల కలశాలు కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. బం గారం, పచ్చలతో ఆ కలశాలు తయారయ్యా యి. కార్యక్రమానికి వచ్చే ప్రముఖులను స్వాగతించే ఏర్పాట్లలో నిర్వాహకులు బిజీగా ఉండడం గమనించిన ఆ వ్యక్తి కలశాలను చోరీ చేశాడు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

చోరీకి గురైన కలశాలు సుధీర్ జైన్ అనే వ్యాపారవేత్తవని నిర్వాహకులు పేర్కొన్నారు. పోలీసులు సీసీ టీవీలను పరిశీలించగా.. కలశాలను ఓ వ్యక్తి సంచిలో తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా ప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు ప్రకటించారు. నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తి పూజారిగా న టిస్తూ పలు ఆలయాల్లో దొంగతనానికి య త్నించినట్టు నిర్వాహకుడు పునీత్‌జైన్ ఆరోపించారు.