07-09-2025 01:12:14 AM
-భారత్ ఆరోపణలు నిజం చేసిన తాజా నివేదిక
-ఖలిస్థానీ గ్రూపులకు కెనడాలో విస్తృత నిధుల నెట్‌వర్క్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: పంజాబ్‌లో కొంత భాగంతో ప్రత్యేక దేశం కావాలని నరమేధం సృష్టిస్తున్న ఖలిస్థానీ ఉగ్రమూకలకు కెనడా నుంచే నిధులు అందుతున్నాయని తేటతెల్లం అయింది. ఎన్నో రోజుల నుంచి భారత్ చేస్తున్న ఆరోపణలకు ‘ద 2025 అసెస్‌మెంట్ ఆఫ్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్స్ రిస్క్స్ ఇన్ కెనడా’ నివేదిక బలం చేకూర్చింది. ఖలిస్థానీ గ్రూపులకు కెన డా నుంచి పెద్ద ఎత్తున నిధులు సమకూరుతున్నట్టు ఈ నివేదిక ఆరోపించింది. కెనడా నుంచి ‘బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్’, ‘ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్’ అనే రెం డు సంస్థలు పని చేస్తూ ఖలిస్థానీ తీవ్రవాదా న్ని ప్రోత్సహిస్తున్నాయి. మనీలాండరింగ్ వంటి అక్రమమార్గాల్లోనే ఎక్కువ నిధులు సమకూరుతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది.
హింసను ప్రేరేపిస్తున్న ఖలిస్థానీ గ్రూప్
ఖలిస్థానీ తీవ్రవాద సంస్థ హింసను ప్రేరేపిస్తుందని నివేదిక ఆరోపించింది. ‘కెనడాలో క్రిమినల్ కోడ్ కింద జాబితా చేయబడ్డ అనే క తీవ్రవాద సంస్థలు పీఎంవీఈ (రాజకీయంగా ప్రేరేపించబడిన హింసాత్మక తీవ్ర వాదం) కిందకు వస్తాయి. బబ్బర్ ఖల్సా ఇం టర్నేషనల్, ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్ సంస్థలు కెనడా నుంచి నిధులు పొం దుతున్నాయని నిఘా సంస్థలు గమనించా యి. ఈ గ్రూపులకు గతంలో కెనడాలో వి స్తృతమైన నెట్‌వర్క్ ఉండేది.
ప్రస్తుతం ఖలిస్థానీవాదానికి మద్దతు తెలిపే వ్యక్తులే ఆర్థిక సాయం చేస్తున్నారు. ఖలిస్థానీ గ్రూపులు భా రత సంతతి వ్యక్తుల నుంచి విరాళాలు సేకరించేవి. లాభాపేక్ష లేని సంస్థల నుంచి నిధు లు సమకూర్చుకునేవి. ఆ రెవెన్యూ వారు చేసే ఖర్చులలో చిన్న మొత్తం మాత్రమే. మా దకద్రవ్యాల అక్రమ రవాణా కెనడాకు అతిపెద్ద ముప్పుగా ఉంది. పలు క్రిమినల్ కార్య కలాపాలను కూడా ఈ గ్రూపులు కొనసాగిస్తున్నాయి’ అని నివేదిక తెలిపింది. కెన డా లో మరణించిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ హత్యలో భారత్ ప్రమేయముందని మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఆ సమయంలో కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నా యి. మార్క్ కార్నీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సంబంధాలు కాస్త మెరుగుపడ్డాయి.