calender_icon.png 31 December, 2025 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ రెడ్డికి చిన్న గుత్తేదారులు కనిపించడం లేదా?

31-12-2025 01:36:17 PM

బిల్లుల మంజూరులో నిర్లక్ష్యం ఎందుకు?

ప్రభుత్వ నిర్లక్ష్యానికి గుత్తేదారులు బలి

హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) మరోసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విరుచుకుపడ్డారు. 'మన ఊరు- మన బడి' గుత్తేదారులు బుధవారం నాడు హరీశ్ రావును కలిశారు. గుత్తేదారులకు బిల్లులను ప్రభుత్వం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 'మన ఊరు- మన బడి'(Mana Ooru Mana Badi) గుత్తేదారులు హరీశ్ రావుకు తమ సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... గుత్తేదారులకు బిల్లులు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిల్లుల మంజూరులో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా ఉంది?, సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) చిన్నచిన్న గుత్తేదారులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి గుత్తేదారులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.