31-12-2025 02:06:18 PM
నిలిచిపోయాయి ఇంటర్నెట్ సేవలు..
బెల్లంపల్లి,(విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేంద్రంలో(Bhimini Mandal Center) బుధవారం తెల్లవారుజామున బీఎస్ ఎన్ ఎల్ కాఫర్,ఓ ఎఫ్ సీ కేబుల్ ను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. సంఘటన వివరాలు ఇలావున్నాయి. మండల కేంద్రం ప్రధాన రహదారిలో ఉన్న బీఎస్ఎన్ఎల్ కేబుల్, ఓఎఫ్సీ కేబుల్ ను సైతం చోరీ మండలంలో కలకలం రేపింది. దొంగలు ప్రత్యేక వాహనంలో వచ్చి అత్యంత విలువైన కాఫర్, ఓఎఫ్సీ కాబుల్ ను ఎత్తుకెళ్లారు. టవర్ ఎక్కి మరి కేబుల్ ను కట్ చేసి ఎత్తుకెళ్లారు. కేబుల్ తోపాటు సీసీ కెమెరాలు కూడా ఎత్తుకెళ్లారు.
బీ ఎస్ ఎన్ ఎల్ కేబుల్ టార్గెట్..
దొంగలు బీఎస్ ఎంఎల్ కేబుల్ నే టార్గెట్ గా చోరికి పాల్పడుతున్నారు. పక్షం రోజుల క్రితం నుంచి నెన్నెల, బెల్లంపల్లి మండలాల్లో బీఎస్ ఎన్ ఎల్ కేబుల్ ను దొంగతనం జరిగినది. కాఫర్, ఓఎఫ్సీ కాబుల్ లక్ష్యంగా ఈ దొంగతనాలు జరగడం గమనార్హం. నెన్నెల మండల కేంద్రం, బెల్లంపల్లి మండలంలోని చిన్నభూద గ్రామంలో బీఎస్ఎన్ఎల్ కాఫర్, ఓఎఫ్సీ కేబుల్ ను ఎత్తుకెళ్లారు. బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా జరుగుతోన్న వరుస దొంగతనాలు బెల్లంపల్లి నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి. అత్యంత విలువైన కాఫర్, ఓఎఫ్సీ కేబుల్ లక్ష్యంగా చేసుకొని దొంగలు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు.ఈ దొంగతనాలకు పాల్పడుతున్నది ఒకే ముఠా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగా పోలీసులు దర్యాపు చేస్తే దొంగతనాల గుట్టు బయట పడుతుందని పలువురు భావిస్తున్నారు. బీమినీ మండల కేంద్రంలో జరిగిన దొంగతనం ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి దర్యాప్తు చేపట్టారు.