calender_icon.png 31 December, 2025 | 3:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబ్దుల్లాపూర్ మెట్‌లో పర్యటించిన అడిషనల్ కలెక్టర్

31-12-2025 02:09:09 PM

రామోజీ ఫిలిం సిటీ నుంచి ఇనాం గూడా వరకు రోడ్ల పరిశీలన 

అబ్దుల్లాపూర్ మెట్: అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో రంగారెడ్డి జిల్లా(Rangareddy District) అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ చంద్రారెడ్డి బుధవారం పర్యటించారు. హైదరాబాద్ _ విజయవాడ జాతీయ రహదారి ఇనాం గూడా నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు పలు సందర్భాలలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తి.. గంటల కొద్ది ప్రజలు రోడ్లపై పడడమే కాక.. పలుమార్లు యాక్సిడెంట్లు కూడా జరుగుతుండడంతో ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఉదయం రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, ఇబ్రహీంపట్నం ఆర్డీవో, ఆర్ అండ్ బి అధికారులు, అబ్దుల్లాపూర్ మెట్ తహసిల్దార్, అబ్దుల్లాపూర్ మెట్ ఇన్ స్పెక్టర్ అధికారులు రామోజీ ఫిలిం సిటీ నుంచి ఇనాం కూడా వరకు రోడ్డును పరిశీలించారు. 

అలాగే సంక్రాంతి పండగ దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా... వర్షకాలంలో కురిసిన వర్షాలకు రోడ్డు మొత్తం గుంతల మయంగా మారింది. దీంతో రోడ్డుపై ఏర్పడిన గుంతలు తాత్కాలిక మరమతులు చేయాలని అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే అబ్దుల్లాపూర్ మండల కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారస్తుల దుకాణాలను  కూడా తొలగించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, ఆర్ అండ్ బి అధికారులు, అబ్దుల్లాపూర్ మెట్ తహసిల్దార్ సుదర్శన్ రెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్ ఇన్స్ పెక్టర్ తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.