15 April, 2026 | 3:57 AM

ఘనంగా బీఆర్ అంబేద్కర్ జయంతి

15-04-2026 01:26 AM

స్ఫూర్తి పారామెడికల్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో నిర్వహణ

హైదరాబాద్, ఏప్రిల్ 14(విజయక్రాంతి): బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒకరు కృషి చేయాలని స్పూర్తి పారామెడికల్ కళాశాల కరెస్పాండెంట్ జుట్ల సుదర్శన్ కుమార్ పేర్కొన్నారు. కళాశాల ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి అత్యున్నతమైన భారత రాజ్యాంగం ద్వారా పేద ప్రజలకు దక్కాల్సిన హక్కులు, అనేక రక్షణ చట్టాలు చేసిన మహనీయుడు అని కొనియాడారు.

కేవలం విద్య ద్వారానే ఈ సమాజంలో మార్పు వస్తుంది కాబట్టి అందరూ మంచి విద్యను అభ్యసించి ఉత్తమ పౌరులుగా మారినప్పుడే మాత్రమే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే ఆ మహా మనిషికి మన వారసులవుతామనే విషయం గుర్తించుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు శ్రీధర్, సాయిరాజేష్, కిషన్ లాల్, మధు తదితరులు పాల్గొన్నారు.