calender_icon.png 9 July, 2025 | 3:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలో ఎస్‌సీఈఆర్టీను ఆవిష్కరించిన మందకృష్ణ

09-07-2025 12:00:00 AM

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): బీఎడ్ అభ్యర్థులు తలపెట్టిన చలో ఎస్‌సీఈఆర్‌టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసె ర్చ్ అండ్ ట్రైనింగ్) పోస్టర్‌ను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మంగళవారం తెలంగాణ రాష్ట్ర బీఎడ్ నిరుద్యోగ అభ్యర్థుల సంఘం ఆధ్వరయలో ఆవి ష్కరించారు.

స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులను 80 శాతం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఎడ్ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 10 నుం చి 14 వరకు యాదగిరిట్ట నుంచి హైదరాబాద్ ఎస్‌సీఈఆర్టీ కార్యాలయం వరకు మహాపాదయాత్ర చేపట్టనున్నారు.

పాదయాత్రకు సంబంధించిన పోస్టర్‌ను మంద కృష్ణ మాదిగ ఆవిష్కరించారు. కార్యక్రమం లో సంఘం అధ్యక్షుడు మూర్తికుమార్, ఉపాధ్యక్షుడు కోటగిరి కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కళావతి పాండు, జనరల్ సెక్రటరీ ఎల్ అశోక్ పాల్గొన్నారు.