calender_icon.png 9 July, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాల టైమ్‌టేబుల్ మార్చండి

09-07-2025 12:00:00 AM

బీసీ, ఎస్సీ గురుకులాల కార్యదర్శులకు టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య వినతి

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): రాష్ట్రంలోని గురుకులాల టైమ్‌టేబుల్‌ను సవరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కొమురయ్య కోరారు. హైదరాబాద్ లోని సంక్షేమ భవన్‌లో బీసీ గురుకులాలు, ఎస్సీ గురుకులాల కార్యదర్శులు బీ సైదులు, అలుగు వర్షి ణిలను మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై గురుకులాల కార్యదర్శులు సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పినట్టు తెలిపారు. అదేవిధంగా సాంఘిక సంక్షేమ గురుకులాల్లో కామన్ ప్రమోషన్ ఛానెల్ ఉండేలా చూడాలని అధికారులను విన్నవించారు.