3 July, 2026 | 11:15 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

మంత్రి వివేక్‌ను సన్మానించిన మండల కాంగ్రెస్ నాయకులు

09-06-2025 12:00 AM

మందమర్రి, జూన్ 8 : నూతన రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని మందమర్రి మండల కాంగ్రెస్ నాయకులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రాంచందర్, మండల పార్టీ అధ్యక్షులు బానోత్ నీలయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆకుల అంజి, మాజీ ఎంపిటిసి దుర్గం కుమార్, దుర్గం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నాయకుల సంబురాలు

మందమర్రి, జూన్ 8: చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించి, నేడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పట్టణంలో కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు నిర్వహించారు.  పట్టణంలోని పాత బస్టాండ్ చౌరస్తాలో ఆదివారం కాంగ్రెస్ నాయకులు బాణాసంచా కాల్చి, సంబరాలు నిర్వహించి, మిఠాయిలు పంపి ణీ చేశారు.

ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, నాయకులు సోత్కు సుదర్శన్, మంద తిరుమల్ రెడ్డి, పుల్లూరు లక్ష్మణ్, నేరువట్ల శ్రీనివాస్, ఎండి ఆఫీస్, ఎండి జమీల్, ఎండి పాషా, సోత్కు ఉదయ్, కడారి జీవన్ కుమా ర్, కనకం రాజు, బూడిద శంకర్, ఆకారం రమేష్, మంకు రమేష్, మహంత్ అర్జున్, సట్ల సంతోష్, మాయ తిరుపతి, బండి శంకర్ గౌడ్ పాల్గొన్నారు.

మంత్రి వర్గంలో మాలలకు సముచిత స్థానం

అదిలాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): రాష్ట్ర మంత్రి వర్గంలో మాల సామాజిక వర్గానికి స్థానం కల్పించడం హర్షనీయమని ఆదిలాబాద్ జిల్లా మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు కొప్పుల రమేష్ అన్నారు. రాష్ట్ర మంత్రిగా  ప్రమాణ స్వీకారం చేసిన చెన్నూ రు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి ని ఆదిలాబాద్ జిల్లా మాల సంక్షేమ సంఘం సభ్యులు కలిసారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మంత్రి వివేక్‌ను కలిసి పులమొక్క ను అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు రమేష్ మాట్లాడుతూ... కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గ విస్తరణలో భాగంగా చెన్నూరు శాసనసభ్యులు  గడ్డం వివేక్ వెంకటస్వామికి చోటు కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వడం సం తోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అసోసియేట్ అధ్యక్షులు పాశం రాఘవేంద్ర, జిల్లా సహాయ కార్యదర్శి ముల్కల రాజేశ్వర్, అక్కపెళ్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.