calender_icon.png 27 January, 2026 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

30న మండల స్థాయి సీఎం కప్ పోటీలు

27-01-2026 06:38:00 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ రూరల్ మండల స్థాయి సీఎం కప్ ఎంపిక పోటీలు ఈనెల 30న నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వంశీ పేర్కొన్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ రూరల్  మండలానికి చెందిన గ్రామస్థాయిలో ఎంపికైన క్రీడాకారులు 30వ తేదీన ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రిపోర్ట్ చేయాలన్నారు. మండలంలోని సంబంధిత గ్రామ పంచాయతీలకు చెందిన క్రీడాకారులు సకాలంలో పోటీలకు హాజరయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మండల విద్యాధికారి రమేష్ రెడ్డి, మండల ఇన్చార్జ్ కృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు కాంతారావు, జ్యోతి, స్వామి, రాయేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.