6 June, 2026 | 1:41 AM

ఏసీబీకి చిక్కిన మండల సర్వేయర్

06-06-2026 12:00 AM
  1. రైతును రూ.25వేలు డిమాండ్ చేసిన ఉద్యోగి
  2. కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లో ఘటన

హుజురాబాద్, జూన్ 5 (విజయ క్రాం తి): కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం లో రెవెన్యూ శాఖలో అవినీతి వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. భూమి కొలతల కోసం రైతు నుంచి లంచం డిమాం డ్ చేసిన మండల సర్వేయర్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవా రం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం, సైదాపూర్ మండల సర్వేయర్ కుమారస్వామి ఓ రైతు భూమిని కొలిచేందుకు రూ.25 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.ప్రణాళిక ప్రకారం మే 23న రూ.5 వేలును యూ పీఐ ద్వారా, జూన్ 2న మరో రూ.10 వేలు ను ప్రైవేట్ అసిస్టెంట్ రోహిత్ రెడ్డి ద్వారా సర్వేయర్కు అందించారు.

మిగిలిన రూ.10 వేలును శుక్రవారం ప్రైవేట్ అసిస్టెంట్ తీగల రాజేష్ ద్వారా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.అనంతరం సర్వేయర్ కుమారస్వామికి రసాయన పరీక్షలు నిర్వహించిన అధికారులు వాంగ్మూ లాలు సేకరిస్తున్నారు. కరీంనగర్ ఏసీబీ డీఎ స్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి.