calender_icon.png 27 July, 2025 | 10:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టుల లొంగుబాటు

25-07-2025 12:00:00 AM

రాయ్‌పూర్, జూలై 24: ఛత్తీస్‌గఢ్‌లో గు రువారం పోలీసుల ఎదుట భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. నారాయణ్పూర్, సుక్మా, బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో మొ త్తం 51 మంది మావోయిస్టులు ఆయుధాలను వీడి లొంగిపోయినట్లు బస్తర్ ఐజీ సుం దర్ రాజ్ తెలిపారు. బీజాపూర్ జిల్లా బస్తర్ ఐజీ ఎదుట 25 మంది లొంగిపో గా.. వారి పై రూ. 1.15 కోట్ల రివార్డు ఉంది.

కాంకేర్ జిల్లా ఎస్పీ కల్యాణ్ ఎదటు 13 మంది లొం గిపోగా.. వారిపై రూ. 62 లక్షల రివా ర్డు, సుక్మా ఎస్పీ కిరణ్  ఎదుట లొంగిపోయి న ఐదుగురిపై రూ. 6 లక్షల రివార్డు, నారాయణ్‌పూర్ ఎస్పీ రాబిన్ సన్ ఎదుట నలు గురు మహిళా మావోయిస్టులు సహా 8 మంది లొంగిపోగా వారిలో కమాండర్ కమలేష్ ఉన్నారని ఎస్పీ వివరించారు. వీరందరిపై 33 లక్షల రివార్డు ఉంది.