25-07-2025 12:00:00 AM
మాస్కో, జూలై 24: రష్యాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చైనా సరిహద్దు అమూర్ ప్రాంతంలో విమానం కూలిన ఘటనలో 49 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు కాగా.. మిగతా ఆరుగురు సి బ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నట్టు రష్యన్ మీడియా తెలిపింది. అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏఎ న్‌ఁ24 ప్యాసింజర్ విమానం బ్లాగోవెష్‌చె న్స్ నుంచి చైనా శివారు ప్రాంతం టిండా ప్రాంతానికి బయల్దేరింది.
మరికొద్ది సేపట్లో విమానం ల్యాండ్ అవ్వాల్సి ఉండగా.. ఉన్నట్టుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్‌తో సం బంధాలు తెగిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ సర్వీసెస్‌ను సి ద్ధం చేశారు. విమానం కోసం గాలించగా.. గమ్య స్థానానికి కేవలం 15 కిలోమీటర్ల దూ రంలో అది కూలిపోయినట్టు గుర్తించారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
ప్రమాదం ధాటికి విమానం పూ ర్తిగా కాలిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. విమానం ల్యాండింగ్ చేస్తుండగా వాతావరణం అనుకూలించలేదని తెలిసింది. రెండోసారి ప్రయత్నించే క్రమంలో రాడార్ నుంచి సంబంధాలు తెగిపోవడంతో విమా నం కూలినట్టు తెలుస్తోంది. ల్యాండింగ్ సమయంలో వాతావరణం అనుకూలించకపో వడం, పైలట్ తప్పిదం కారణంగానే ప్రమా దం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.