25-07-2025 12:00:00 AM
ప్రతిపక్షాల నిరసనలతో అట్టుడికిన పార్లమెంట్
న్యూఢిల్లీ, జూలై 24: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నాలుగో రో జైన గురువారం కూడా ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగాయి. నాలు గో రోజు ఉభయసభలు మొదలు కాగానే బీహార్ ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరస న చేపట్టాయి. దీంతో సభల్లో ఎటువంటి కార్యకలాపాలు సాగలేదు. దాంతో లోక్‌సభను స్పీకర్ ఓంబిర్లా మధ్యాహ్నం 2 గంటల వరకు వా యిదా వేశారు.
అనంతరం రాజ్యసభలో కూడా గందరగోళం కొనసాగ డంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పెద్దల సభను కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా ప్రతిపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో లోక్‌సభను నేటికి వాయి దా వేస్తూ స్పీకర్ నిర్ణయం వెలువరించారు. ఓటర్ల జాబితా సవరణపై పెద్దల సభలో కూడా ఆం దోళనలు కొనసాగడంతో రాజ్యసభ కూడా నేటికి వాయిదా పడింది.