calender_icon.png 20 August, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఈడి పేల్చి వాహనాన్ని ధ్వంసం చేసిన మావోయిస్టులు

24-03-2025 12:58:29 AM

ఘటనలో  గాయాలు 

చర్ల, మార్చి 23 (విజయ క్రాంతి)  చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా భూపాలపట్నం జాతీయ రహదారిపై భద్రతా దళాల పికప్ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఆదివారం మావో యిస్టులు  భారీ దాడికి పాల్పడ్డారు.మావోయిస్టులు  గొర్ల డ్రెయిన్ సమీపంలో ఐఈడీ తో వాహనాన్ని పేల్చివేశారు, ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య కాల్పులు  జరిగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ దాడిలో కొందరు సైనికులు గాయపడ్డారు.  భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరపడంతో మావోయిస్టులు  దట్టమైన అడవు ల్లోకి పారిపో నాట్లు తెలుస్తోంది.ఐ ఈ డి పేలడంతో రహదారి మార్గం పూర్తిగా ద్వంశమైంది. ఘటన తర్వాత ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించి, సెర్చ్ ఆపరేషన్ నిర్వచించారు .మొత్తం ఘటనపై భద్రతా సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. గాయపడిన జవాన్లను హాస్పటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు