7 April, 2026 | 8:29 PM

అంగన్‌వాడీ టీచర్‌ను హతమార్చిన మావోలు

08-12-2024 12:07 AM

* బీజాపూర్ జిల్లాలో ఘటన

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 7,( విజయక్రాంతి): ఛత్తీస్‌ఘడ్‌లో   అంగన్‌వాడీ టీచర్ లక్ష్మిని మావోయిస్టులు హతమార్చారు. ఈ ఘటన బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ సీఆర్‌పీఎఫ్ క్యాంప్ సమీ పంలో జరిగింది. సీఆర్‌పీఎఫ్ క్యాం పు నుంచి ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ దారుణం చోటు చేసుకో వడంతో స్థానికులు తీవ్ర భయాందోళ చెందుతున్నారు. అంగన్‌వాడీ టీచర్ లక్ష్మిని మావోయిస్టులు ఇప్పటికే రెండుసార్లు హెచ్చరించినట్లు సమాచారం. పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా లక్ష్మి వ్యవహరిస్తుందనే అనుమానంతో ఆమెను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లారు. కుమారుడు చూస్తుండగానే రాత్రి 8 గంటల సమయంలో పదునైన ఆయుధాలతో ఆమెపై దాడిచేసి హత్యచేశారు. తల్లిని రక్షించేందుకు వెళ్లిన కొడుకుతో మావోయిస్టులు గొడవ పడ్డారని తెలుస్తోంది. పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించినందుకే ఆమెను హతమార్చినట్లు తెలుస్తోంది.