calender_icon.png 22 November, 2025 | 5:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. 37 మంది మావోయిస్టులు లొంగుబాటు

22-11-2025 05:11:04 PM

హైదరాబాద్: తెలంగాణ పోలీసుల ఎదుట  శుక్రవారం 25 మంది మహిళలు సహా మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులను తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ మాట్లాడుతూ... అజ్జాతంలో ఉన్న 37 మంది మావోయిస్టులు ఇవాళ లొంగిపోయారని, వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, మరో ముగ్గురు డివిజన్ కమిటీ సభ్యులు, 9 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారని ఆయన తెలిపారు. 

ముగ్గురు సీనియర్ మావోయిస్టు నాయకులు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, అప్పాసి నారాయణ అలియాస్ రమేష్, ముచ్చకి సోమ్ దా అలియాస్ ఎర్రా వీరందరూ రాష్ట్ర కమిటీ సభ్యులు (SCMలు)గా పనిచేస్తున్నారు. మిగతా మావోయిస్టులంతా ఛత్తీస్ గఢ్ కు చెందిన వారని, ఖమ్మం డివిజనల్ కమిటీకి చెందిన 9 మంది, దక్షిణ బస్తర్ కమిటీకి చెందిన వారు 22 మంది ఉన్నట్లు డీజీపీ వెల్లడించారు. ఒక్కొక్కరికి రూ.20 లక్షల రివార్డు ఉందని, అది వారికే అందజేస్తామన్నారు. 

పోలీసు అధికారుల ప్రకారం.. డీవీసీఎం లేదా సీవైపీసీఎం ర్యాంకులు కలిగిన కేడర్లకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల రివార్డును ప్రకటించారు. ఏరియా కమిటీ సభ్యులు (ACM/PPCM) ఒక్కొక్కరికి రూ.4 లక్షల రివార్డును, పార్టీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష నగదు రివార్డును అందజేస్తున్నట్లు డీజీపీ శివధర్ వివరించారు. లొంగిపోయిన అందరిపై కలిసి రూ.1.41 కోట్ల రివార్డు ఉందని, లొంగిపోయిన వారందరికీ పునరావాసం కల్పించి, వారు సమాజంలో తిరిగి కలిసిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయపడుతుందని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.

నవంబర్ 18 మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్ లో హిడ్మా, అతని భార్య రాజే, మరో నలుగురు మరణించినట్లు ఆంధ్రప్రదేశ్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఇంటెలిజెన్స్) మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్లలో దాదాపు 12 మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో టాప్ కమాండర్ మద్వి హిద్మా, మోస్ట్ వాంటెడ్ తిరుగుబాటు నాయకులలో ఒకరు, దాదాపు 300 మంది భద్రతా సిబ్బంది హత్యలలో పాల్గొన్నట్లు సమాచారం. మరణించిన వారిలో అతని భార్య కూడా ఉంది.