calender_icon.png 22 November, 2025 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్‌ ల అమలును వెంటనే ఉపసంహరించుకోవాలి

22-11-2025 05:19:29 PM

IFTU జిల్లా సహాయ కార్యదర్శి దేసోజు మధు..

నూతనకల్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి దేశోజు మధు డిమాండ్ చేస్తూ, శనివారం మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా కార్మిక సంఘాలు పోరాడుతున్నప్పటికీ కేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా మొండిగా వ్యవహరిస్తూ కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు.

4 లేబర్ కోడ్‌లు అమలు మూలంగా కార్మికులు తమ హక్కులను పూర్తిగా కోల్పోతారని, విచ్చలవిడి దోపిడీకి గురవుతారని, కార్పోరేట్ యాజమాన్యాల దోపిడీకి అద్దు అదుపు లేకుండా పోతుందన్నారు. 4 లేబర్ కోడ్ ల అమలును వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ చట్టాలు రద్దయ్యే వరకు కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ నాయకులు నకరేకాంటి సైదులు, మూరగుండ్ల వెంకన్న, నాగమ్మ, రవి, వెంకన్న, మన్సూర్, ప్రభాకర్, పద్మ,మంజుల తదితరులు పాల్గొన్నారు.