calender_icon.png 22 July, 2025 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మారేడుపల్లి రౌడీ షీటర్ల పనే!

22-07-2025 01:04:44 AM

  1. నాపై దాడికి యత్నించింది వారే

ప్రాణహాని ఉందని ముందే డీసీపీకి చెప్పా

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 21 (విజయక్రాంతి): తనపై దాడికి యత్నించిన దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన తనకే రక్షణ లేకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. తార్నాక ఆర్టీసీ ఆసుపత్రి వద్ద తనపై జరిగిన దాడి యత్నంపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.

బుధవారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో తాను తార్నాక ఆర్టీసీ ఆసుపత్రి వద్ద నుంచి వెళ్తుండగా ఆరు బైక్‌లపై వచ్చిన కొందరు దుండగులు తన వాహనాన్ని అడ్డగించి దాడికి ప్రయత్నించారని శ్రీగణేష్ తెలిపా రు.

ఈ దాడి వెనుక మారేడుపల్లికి చెందిన కొంతమంది రౌడీ షీటర్ల హస్తం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. దాడికి ముందే కొంతమంది వ్యక్తుల నుంచి తనకు సమాచారం అందిందని, ఈ విషయమై ఉత్తర మండల డీసీపీని కలిసి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన ట్లు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన వెం టనే తాను ఉస్మానియా యూనివర్సిటీ పోలీ స్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశానని తెలిపారు.