calender_icon.png 22 July, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాల నేపథ్యంలో హైడ్రా అప్రమత్తం

22-07-2025 01:02:27 AM

మల్కాజిగిరి, జులై 21 : ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో,మల్కాజిగిరి డివిజన్ లో గల లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వ, రహదారి జాములు వంటి సమస్యల నివారణకు హైడ్రా టీంలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. స్థానిక కార్పొరేటర్ శ్రవణ్ పర్యవేక్షణలో, రెయిన్ వాటర్ డ్రైనేజ్ క్లీనింగ్, రోడ్డుపై గదుల నిర్మూలన, పౌరులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారు.

ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ప్రజల ఆరాగ్యమే మా తొలి ప్రాధాన్యత, జిహెచ్‌ఎంసీ సహకారంతో ప్రతీ ప్రాంతంలో హైడ్రా టీంలు మున్సిపల్ అధికారులతో కలిసి పనిచేస్తున్నాయి. ఎటువంటి ఎమర్జెన్సీ పరిస్థితులు ఎదురైనా, వెంటనే స్పందించేందుకు సిద్ధంగా ఉన్నాం అని పేర్కొన్నారు.