calender_icon.png 18 November, 2025 | 2:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల వరప్రదాయని మారెళ్లపాడు ప్రాజెక్టు

18-11-2025 12:00:00 AM

- మార్చి నాటికీ త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేస్తాం

-రైతు కళ్ళల్లో ఆనందం నింపడమే ప్రజా ప్రభుత్వ ఏకైక ధ్యేయం

- ప్రాజెక్టు నిర్మాణంతో అన్నదాతల ఏళ్ల కలను నిజం చేసి ఆనందం నింపుతాం

- మారేళ్లపాడు ప్రాజెక్ట్ సందర్శనలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మణుగూరు / అశ్వాపురం,నవంబర్ 17 (విజయక్రాంతి) : అశ్వాపురం, బూర్గంపా డు మండలాలలోని అన్నదాతలకు సాగునీరు అందించే వరప్రదాయిని మారేళ్లపా డు ప్రాజెక్ట్ అని, పినపాక ఎమ్మెల్యే పా యం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.అశ్వా పురం మండలంలోని బిజీ కొత్తూరు గ్రా మం సీతారామ ప్రాజెక్టు కెనాల్ వద్ద నూ తనంగా నిర్మిస్తున్న మారెళ్ళ పాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను సోమవారం అధికా రులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.అనంతరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు.

బూర్గంపాడు, అశ్వాపురం మండ లాలలోని రైతాంగానికి ఈ ప్రాజెక్టు జీవ నాడిగా మారుతుందన్నారు. ప్రజా ప్రభు త్వం ఎంతో ప్రతిష్టాత్మ కంగా నిర్మిస్తున్న మారేళ్లపాడు ప్రాజెక్ట్ వల్ల అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో 26,309 ఎకరా లకు సాగునీరు అందుతుందని, మార్చి నాటికి నిర్మాణం పూర్తి చేసి రైతులకు సాగునీటిని అందిస్తామన్నారు. రైతు క ళ్ళల్లో ఆనందం నింపడమే ప్రజా ప్రభుత్వ ఏకైక ధ్యేయమని,ప్రాజెక్టు నిర్మాణంతో అన్నదాతల ఏళ్ల కలను నిజం చేసి ఆనం దం నింపుతామన్నారు.

ఈ ప్రాజెక్టు ద్వా రా అన్నదాతలకు రెండు పంటలకు స మృద్ధిగా నీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అశ్వాపురం మండ లంలో సుమారు 10 కుంటలను ఈ నీటి ద్వారా నింపి సాగు నీటిని అందిస్తామ న్నారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే నీటిని లింక్ కెనాల్ ద్వారా తరలిస్తామని, ఇప్పటికే మోటార్లు సిద్ధం చేశామని,పను లు వేగవంతం కొనసాగుతాయని ఆయన తెలిపారు.రానున్న రబీ సీజన్ నాటికి రై తులకు సాగునీరు అందించి తీరుతా మ న్నారు. చెరువులు కుంటలు ఎప్పుడు నిం డు కుండలా కళకళలాడాలన్నారు.

కాం గ్రెస్ ప్ర భుత్వం రైతుల కోసమే పనిచేస్తుం దన్నారు. సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక నాయకు లు నా దృష్టికి తీసుకొచ్చారని ఆయన తెలిపారు.దింతో ప్రాజెక్టు పనుల ను వేగవంతం గా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇరిగేషన్ శాఖ అధికా రులు పనులు వేగవంతం చేయాలని, ఆదేశించారు. ఇంకా ఇతర ఇబ్బందులు ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అధికారులు నివేదికలు సిద్ధం చేయాల న్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.